Hindustan Shipyard Recruitment: హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL) పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పర్మినెంట్, కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డీజీఎం, సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ కన్సల్టెంట్ & కన్సల్టెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
* పర్మినెంట్ విభాగంలో జనరల్ మేనేజర్ (01), అడిషనల్ జనరల్ మేనేజర్ (01), డీజీఎం (03), సీనియర్ మేనేజర్ (04), మేనేజర్ (08), డిప్యూటీ మేనేజర్ విభాగంలో (08) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కాంట్రాక్ట్ విభాగంలో ఖాళీల వివరాలు.. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (02), ప్రాజెక్ట్ మేనేజర్ (01), ప్రాజెక్ట్ ఆఫీసర్ (28), సీనియర్ కన్సల్టెంట్ (03), కన్సల్టెంట్ విభాగంలో (01) ఖాళీలు ఉన్నాయి.
* జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్‌లో 20 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
* అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి. పబ్లిక్ సెక్టార్‌లో 16 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి.
* DGM పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/గ్రాడ్యుయేట్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. 15 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి.
* సీనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెకానికల్/ఎలక్ట్రికల్/నావల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 12 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల ప్రక్రియ జూన్ 23 ప్రారంభమయ్యాయి. చివరి తేదీలు ఒక్కో పోస్ట్‌కు ఒక్కోలా ఉన్నాయి.
* అభ్యర్థులు https://www.hslvizag.in/content/200_1_Careers.aspx వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం.. క్లిక్ ఇయర్ టు అప్లైపై క్లిక్ చేసిన తర్వాత మీరు కోరుకున్న జాబ్ లింక్‌పై క్లిక్ చేసిన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.