GRSE Ltd Recruitment 2022: నెలకు రూ.90 వేల జీతంతో.. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్.. 24 డిజైన్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల

GRSE Ltd Recruitment 2022: నెలకు రూ.90 వేల జీతంతో.. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
GRSE Ltd Recruitment 2022

Updated on: Nov 08, 2022 | 3:09 PM

భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్.. 24 డిజైన్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్/నేవల్ ఆర్కిటెక్చర్/షిప్ బిల్డింగ్/సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో మినహాయింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 21, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.23,800ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us