GMC Rangareddy Jobs 2025: డిగ్రీ, టెన్త్‌ అర్హతతో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సర్కార్‌ కొలువు.. ఎలాంటి రాత పరీక్షలేదు

డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఎంఎల్‌టీ అర్హతతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీ వరకు..

GMC Rangareddy Jobs 2025: డిగ్రీ, టెన్త్‌ అర్హతతో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సర్కార్‌ కొలువు.. ఎలాంటి రాత పరీక్షలేదు
GMC Rangareddy Jobs

Updated on: May 08, 2025 | 4:08 PM

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 63 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 13
  • రిఫ్రాక్షనిస్ట్‌/ఆప్టీషియన్‌ పోస్టుల సంఖ్య: 01
  • రేడీయోగ్రాఫిక్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • ఓటీ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • అనస్థీషియా టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • డెంటల్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 01
  • బ్లడ్ బ్యాంక్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • రికార్డ్‌ క్లర్క్‌/ రికార్డ్‌ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 01
  • కాటలొగర్‌ పోస్టుల సంఖ్య: 01
  • మ్యూసియం అసిస్టెంట్ కమ్‌ ఆర్టిస్ట్‌ పోస్టుల సంఖ్య: 01
  • ఆడియో విజువల్ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 01
  • వార్డ్‌ బాయ్‌ పోస్టుల సంఖ్య: 04
  • దోబి/ప్యాకర్స్‌ పోస్టుల సంఖ్య: 3
  • కార్పెంటర్‌ పోస్టుల సంఖ్య: 01
  • బార్బర్‌ పోస్టుల సంఖ్య: 03
  • టైలర్‌ పోస్టుల సంఖ్య: 01
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టుల సంఖ్య: 03
  • ప్లంబర్‌ పోస్టుల సంఖ్య: 02
  • థియేటర్‌ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 06
  • గ్యాస్‌ ఆపరేటర్‌ పోస్టుల సంఖ్య: 02
  • ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 03

ఆసక్తి కలిగిన వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఎంఎల్‌టీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ కింది పోస్టల్ అడ్రస్‌కు మే 10, 2025వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మేరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,600 నుంచి రూ.22,750 వరకు జీతంగా చెల్లిస్తారు.

చిరునామా

ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, మహేశ్వరం, బీఐఈటీ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.