GGH Kakinada Para Medical Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో (GGH Kakinada).. ఒప్పంద/ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన టెక్నీషియన్ , డార్క్ రూమ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర (Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సి.టి. టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఇ.సి.జి. టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, పెర్ఫ్యూషనిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.17,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి డిప్లొమా/సబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టరయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Chairman, Hospital Development Society, Government General Hospital, Kakinada, AP.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 6, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.