డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రముఖ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లో లొకేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయే విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.? విద్యార్హతలు ఏంటి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా జెన్‌పాక్ట్ సీనియర్ ప్రాసెస్ అసోసియేట్/ప్రాసెస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీకామ్, ఎమ్‌బీఏ (ఫైనాన్స్) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు కచ్చితంగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాలెన్స్ షీట్, ఇన్‌కమ్ స్టేట్‌మెంట్స్, ఫైనాన్షియల్ రేషన్స్, క్రెడిట్ బ్యూరోస్, కేవైసీ వంటి నైపుణ్యాలు తెలిసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ రీసెర్చ్‌లో ప్రావిణ్యం ఉండాలి.
* క్లైంట్ కాల్స్, ఈమెయిల్స్‌ను అర్థం చేసుకునేందుకు గాను మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొత్తం మూడు రౌండ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి రౌండ్‌లో ఆన్‌లైట్ టెస్ట్, రెండో దశలో టెక్నికల్ రౌండ్, మూడో రౌండ్‌లో హెచ్‌ఆర్ డిస్కషన్ ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు మార్చి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..