భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణా రాష్ట్ర పరిధిలోనున్న ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఫుల్ టైం/పార్ట్ టైం ప్రాతిపదికన 17 సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనెస్తీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజమ్, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, రుమటాలజీ, యూరాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, డిప్లొమా/డీఎన్బీ, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్ 27, 2022వ తేదీన ఉదయం 9 గంటలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నోటిఫికేషన్లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: ESIC Medical College abd Hospital, NH3, N.I.T, Faridabad, Haryana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.