Google Job: నిరుపేద గ్రాడ్యుయేట్‌కి రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్‌లో జాబ్.. స్ఫూర్తిదాయక జర్నీ ఇదే!

|

Sep 18, 2024 | 11:27 AM

బీహార్‌ యువకుడు అభిషేక్‌ కుమార్‌కు గూగుల్‌ లండన్‌ ఆఫీస్‌లో ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో జాబ్‌ సాధించాడు. అక్టోబర్‌ నెలలో ఉద్యోగంలో చేరనున్నాడు. బీహార్‌లోని జముయి జిల్లాలోని జము ఖరియా అనే మారుమూల గ్రామానికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అయిన అభిషేక్ కుమార్ పాట్నాలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశాడు. ఇది అభిషేక్ కెరీర్‌లో ఒక పెద్ద విజయం చెప్పుకొవచ్చు..

Google Job: నిరుపేద గ్రాడ్యుయేట్‌కి రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్‌లో జాబ్.. స్ఫూర్తిదాయక జర్నీ ఇదే!
Bihar Graduate Gets Google Job
Follow us on

పాట్నా, సెప్టెంబర్‌ 18: బీహార్‌ యువకుడు అభిషేక్‌ కుమార్‌కు గూగుల్‌ లండన్‌ ఆఫీస్‌లో ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో జాబ్‌ సాధించాడు. అక్టోబర్‌ నెలలో ఉద్యోగంలో చేరనున్నాడు. బీహార్‌లోని జముయి జిల్లాలోని జము ఖరియా అనే మారుమూల గ్రామానికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అయిన అభిషేక్ కుమార్ పాట్నాలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశాడు. ఇది అభిషేక్ కెరీర్‌లో ఒక పెద్ద విజయం చెప్పుకొవచ్చు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అభిషేక్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలో భారీ ప్యాకేజీతో జాబ్ సాధించడం నిజంగా గొప్ప విషయం. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జాముయి సివిల్ కోర్టులో న్యాయవాది కాగా, అతని తల్లి మంజు దేవి గృహిణి. మొదటి నుంచి చదువులో ప్రతిభకనబరిచే అభిషేక్‌.. ఎందరో కలలుకనే డ్రీమ్‌ జాబ్‌ అయిన గూగుల్‌లో కొలువు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా అభిషేక్‌ మాట్లాడుతూ.. ‘ఇది నా అతిపెద్ద విజయం. చాలా సంతోషంగా ఉంది. Googleలో జాబ్‌ దక్కించుకోవడం అనేది చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు ఒక కల. ఇంపాక్ట్‌ఫుల్‌ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది’ అని అభిషేక్‌ చెప్పాడు.

జముయిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన అభిషేక్‌, NIT పాట్నా నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందాడు. 2022లో Amazonలో రూ.1.08 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని పొందాడు. ఇక్కడి నుంచే అతని కెరీర్ ప్రారంభమైంది. అక్కడ మార్చి 2023 వరకు పనిచేశాడు. ఆ తర్వాత అతను జర్మన్ పెట్టుబడి సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ యూనిట్‌కి మారాడు. అయితే గూగుల్‌లో ఉద్యోగం పొందాలనేది అతని చిరకాల కల. దీంతో అప్పటి నుంచి Google ఇంటర్వ్యూలకు సిద్ధమవడం ప్రారంభించాడు. ఓ వైపు రోజుకు 8-9 గంటలు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కోడింగ్ నైపుణ్యాలను పదును పెట్టడం ప్రారంభించాడు. ఇంటర్వ్యూలకు సిద్ధం కావడానికి ప్రతి ఖాళీ క్షణాన్ని ఉపయోగించుకున్నాడు. అందుకు ఒక పటిష్టమైన వ్యూహాన్ని పాటించాడు. అతని అంకితభావం, పట్టుదల చివరకు ఫలించాయి.

‘మట్టితో కట్టిన ఇంటిలో ఉన్ననేను ఇప్పుడు కొత్త ఇంటిని కట్టుకుంటున్నాను. తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమెకు మంచి వైద్యం అందిస్తాను’ అంటూ అభిషేక్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అభిషేక్ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంతా సాధ్యమే అనే మొండి పట్టుదలతో ముందుకు వెళ్తే.. లక్ష్యాలను చేరుకోగలమని అంటున్నాడు అభిషేక్‌. ఎవరైనా, వారు ఎక్కడి నుండి వచ్చినా, వారి నేపథ్యం ఏమైనాగానీ అంకితభావం, పట్టుదలతో కృషి చేస్తే పెద్ద పెద్ద అవకాశాలను అందిపుచ్చుకోగలమని నేను గట్టిగా నమ్ముతున్నానని అంటున్నాడు అభిషేక్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.