భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వా శాఖకు చెందిన నోయిడాలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (ఎడ్సిల్ ఇండియా).. 11 జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎమ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి 30 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 29, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: The Director, National Institute of Animal Biotechnology, Sy.No. 37, Opp. Journalist Colony, Extended Q City Road, Gowlidoddi, Gachibowli, Hyderabad, Telangana, India 500 032.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.