ECIL Hyderabad Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రదాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL Hyderabad).. మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medical Officer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూ తేదీ: జులై 23, 2022.
అడ్రస్: Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR Road, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.