UPSC Prelims Exam 2021: క‌రోనా వేళ యూపీఎస్‌సీ కీల‌క నిర్ణ‌యం.. ప‌రీక్ష‌ల తేదీలో మార్పులు చేస్తూ ప్ర‌క‌ట‌న‌..

|

May 13, 2021 | 2:45 PM

UPSC Prelims Exam 2021 Postponed: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం దేశంపై ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోందీ మాయ‌దారి రోగం. రోజురోజుకీ కేసులు...

UPSC Prelims Exam 2021: క‌రోనా వేళ యూపీఎస్‌సీ కీల‌క నిర్ణ‌యం.. ప‌రీక్ష‌ల తేదీలో మార్పులు చేస్తూ ప్ర‌క‌ట‌న‌..
Upsc
Follow us on

UPSC Prelims Exam 2021 Postponed: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం దేశంపై ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోందీ మాయ‌దారి రోగం. రోజురోజుకీ కేసులు సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఇక మ‌ర‌ణాలు కూడా అదే స్థాయిలో కొన‌సాగుతున్నాయి. క‌రోనా కార‌ణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలైపోయాయి. వీటిలో విద్యా రంగం కూడా ప్ర‌ధాన‌మైంది. ఇప్ప‌టికే దేశంలోని చాలా బోర్డులు త‌మ ప‌రిధిలోని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డం లేదా ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.
ఈ క్ర‌మంలోనే తాజాగా క‌రోనా ప్ర‌భావం యూపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌పై కూడా ప‌డింది. దేశ వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టే సివిల్ స‌ర్వీస్ ఉద్యోగాల ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేస్తూ బోర్డు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగానే సివిల్ స‌ర్వీసెస్ (ప్రిలిమిన‌రీ) ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 10, 2021కి వాయిదా వేశారు. వాస్త‌వానికి ఈ ప‌రీక్ష‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 27 నుంచి నిర్వ‌హించాల్సి ఉంది. కానీ క‌రోనా దృష్ట్యా అక్టోబ‌ర్ 10కి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: Indian 2 : ముదురుతున్న భారతీయుడు వివాదం.. సినిమా ఆలస్యానికి వారే కారణమన్న శంకర్..

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. చివరి తేదీ జూన్‌ 4.. దరఖాస్తు చేయండిలా..!

Southern Railway Recruitment: ఇండియ‌న్ రైల్వేలో మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. గురువార‌మే చివ‌రి తేది..