DRDO Jobs 2025: డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO)లోని సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌.. భారీగా ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి, టెక్నీషియన్‌-ఏ ఉద్యోగాలను భర్తీ..

DRDO Jobs 2025: డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం
DRDO- CEPTAM Recruitment

Updated on: Dec 07, 2025 | 3:17 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO)లోని సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌.. భారీగా ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 764 సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి, టెక్నీషియన్‌-ఏ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 9, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు ఇలా..

  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి పోస్టుల సంఖ్య: 561
  • టెక్నీషియన్‌-ఏ పోస్టుల సంఖ్య: 203

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు అవసరమైన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఎంపికైన వారికి నెలకు సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు, టెక్నీషియన్‌-ఏ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతంగా చెల్లిస్తారు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 28 ఏళ్లకు మించకూడదు. ఇతర వివరాలకు అభ్యర్థులు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

డీఆర్‌డీఓ- సీఈపీటీఏఎం ఉద్యోగాల పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.