DMHO Warangal District Medical Officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ కింద వరంగల్ జిల్లా (Warangal District)లోని పట్టణ, గ్రామీణ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 30 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్/బీఏఎంస్/బీఎస్సీ నర్సింగ్/స్టాఫ్‌నర్స్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 17, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్ధులకు రూ.300లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులకు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు అప్లికేషన్ల వెరిఫికేషణ్ ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా విడుదలవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్: District Medical & Health Office, Warangal District, Telangana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.