DMHO Visakhapatnam Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Visakhapatnam).. ఒప్పంద ప్రాతిపదికన పీడియాట్రీషియన్, గైనకాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టుల (Pediatrician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 131
పోస్టుల వివరాలు: పీడియాట్రీషియన్, గైనకాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టులు, ఆడియోమెట్రీషియన్, మెడికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ తదితర పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ, డిగ్రీ, ఎంఏ, ఎంబీబీఎసస్, సంబంధత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Medical and Health Office, Visakhapatnam, AP.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.