DMHO Srikakulam Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (DMHO Krishna) జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 144 పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి/ సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ఇంటర్మీడియట్/డిప్లొమా/బీఎస్సీ/డిప్లొమా లేదా తత్సమాన డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి. అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 20, 2022 సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా ప్రతి ఒక్కరూ రూ.250ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్ ఛాలెంజెడ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అభ్యర్ధులను అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.35,570 వరకు జీతంగా చెల్లిస్తారు.
అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 6
ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు: 4
బయో మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
కౌన్సెలర్/ ఎంఎస్‌డబ్ల్యూ-2 పోస్టులు: 2
డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 3
రేడియోగ్రాఫర్ పోస్టులు: 11
ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 6
ఎలక్ట్రీషియన్ పోస్టులు: 4
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 39
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 1
ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 7
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 15
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 5
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 15
ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2
ప్లంబర్ పోస్టులు: 6
శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 13
అడ్రస్: DMHO, Srikakulam District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.