DMHO Eluru Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Eluru) నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 23 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, కమ్యూనిటీ కేర్ కోఆర్డినేటర్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ మార్కులు, సంబంధిత పనిలో అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్: District Medical and Health Office, Eluru, West Godavari District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.