DMHO Bhadradri Kothagudem: రాత పరీక్షలేకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దవాఖానాల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..

|

Sep 11, 2022 | 6:50 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem)లోని దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన103 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన..

DMHO Bhadradri Kothagudem: రాత పరీక్షలేకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దవాఖానాల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
Telangana
Follow us on

DMHO Bhadradri Kothagudem District MLHP Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem)లోని వివిధ ప్రభుత్వ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన103 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్ధులకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ అక్టోబర్‌ 3, 2022వ తేదీన విడుదల అవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: District Medical & Health Office, Bhadradri Kothagudem District, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.