ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జీఎంసీ పరిధిలోని ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అనస్తీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/డిప్లొమా/బీఎస్సీ/డీపార్మసీ/బీ ఫార్మసీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్ 21, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.48,440ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
The District Medical & Health Officer, Prakasam District, Ananthapuramu, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.