DCIL Visakhapatnam Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

| Edited By: Ravi Kiran

Sep 20, 2022 | 10:11 AM

కేంద్ర ప్రభుత్వ షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలోనున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Dredging Corporation of India Limited).. ఒప్పంద ప్రాతిపదికన 45 డ్రెడ్జ్ క్యాడెట్‌, ట్రైనీ మెరైన్ ఇంజినీర్, ఎన్‌సీవీ(ట్రైనీస్) పోస్టుల..

DCIL Visakhapatnam Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..
Dcil Visakhapatnam
Follow us on

DCIL Visakhapatnam Dredge Cadet Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలోనున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Dredging Corporation of India Limited).. ఒప్పంద ప్రాతిపదికన 45 డ్రెడ్జ్ క్యాడెట్‌, ట్రైనీ మెరైన్ ఇంజినీర్, ఎన్‌సీవీ(ట్రైనీస్) పోస్టు (Dredge Cadet posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, ప్రీ-సీ జీపీ రేటింగ్ కోర్సు, నాటికల్ సైన్స్‌లో డిప్లొమా, మెరైన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు నవంబర్‌ 30, 2022 నాటికి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 3, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.10,000ల నుంచి రూ.25,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • డ్రెడ్జ్ క్యాడెట్ పోస్టులు: 15
  • ట్రైనీ మెరైన్ ఇంజినీర్ పోస్టులు: 15
  • ఎన్‌సీవీ(ట్రైనీస్) (జీపీ రేటింగ్) పోస్టులు: 15

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.