CBSE CTET December 2021 revised result date: సీబీఎస్సీ సీటెట్ పరీక్షల ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2021 సెషన్‌కు సంబంధించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలు మరింత ఆలస్యంగా వెలువడనున్నాయి. ఫలితాలు వారం రోజుల పాటు ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలుత సీటెట్ 2021 ఫలితాలను ఫిబ్రవరి 15న విడుదల చేస్తామని బోర్డు తెలియజేసింది. ఐతే పలు కారణాల రిత్యా ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత తిరిగి ఎప్పుడు పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారనే విషయానికి సంబంధించి బోర్డు ఇంతవరకు ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. కాగా సీటెట్ ఫలితాల ఆలస్యం కారణంగా.. కొందరు అభ్యర్థులు తమ నిరుత్సాహాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఫలితాల కోసం మిలియన్ల మంది నిరంతరంగా ఎదురు చూస్తున్నారు, మీరు మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారని ఒక అభ్యర్ధి ట్విటర్‌లో తన ఆవేదనను తెలియజేశాడు. రిజల్ట్స్ డిక్లరేషన్ తేదీని ప్రకటించిన తర్వాత గత 7 రోజులుగా ఎదురు చూస్తున్నాము. ఐనా మీ వైపు నుండి స్పష్టత లేదు. . అని మరొకరు సోషల్ మీడియాలో తమ గోడును వెల్లగక్కారు. ఏది ఏమైనా ఫలితాలు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలోనైనా విడుదలౌతాయని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.
Also Read: