CT University: విద్యార్థులకు అద్భుత అవకాశం.. CT యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో విద్య..

|

Jul 30, 2022 | 9:34 AM

CT University: విద్యారంగంలో ప్రపంచ వ్యాప్తంగా కాంపిటేషన్ పీక్స్‌లో ఉంది. నైపుణ్యాలతో కూడిన విద్యనభ్యసించినప్పుడే..

CT University: విద్యార్థులకు అద్భుత అవకాశం.. CT యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో విద్య..
Ct University
Follow us on

CT University: విద్యారంగంలో ప్రపంచ వ్యాప్తంగా కాంపిటేషన్ పీక్స్‌లో ఉంది. నైపుణ్యాలతో కూడిన విద్యనభ్యసించినప్పుడే.. ఈ కాంపిటేషన్ ఫీల్డ్‌లో రాణించగలరు ఎవరైనా. దేశంలో ఇలాంటి నాణ్యమైన విద్యను అందించే టాప్ 30 యూనివర్సిటీల్లో CT యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ యూనివర్సిటీ కూడా విద్యార్థులకు నూతన విద్యా విధానంలో, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తోంది. ఇదే అంశంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హర్ష్ సదావర్తి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. యూనివర్సిటీలోని అవకాశాలను వివరించారు. ‘‘CT యూనివర్శిటీ ప్రధాన లక్ష్యం కొత్త విద్యా విధానం, విద్యాపరమైన నైపుణ్యం వ్యవస్థను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అత్యాధునికమైన ప్రయోగశాలలు, ఉన్నత స్థాయి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విదేశాలలో ఫారిన్ యూనివర్సిటీ లతో టైఅప్‌లు, ఎమ్మెస్ చేయడానికి శిక్షణ ఇవ్వటం, ఫారెన్ లాంగ్వేజ్‌లు నేర్పించడం, సిటీ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల ప్రధాన కర్తవ్యం. CT యూనివర్శిటీ.. శంకర ఐ హాస్పిటల్స్‌తో కలిసి పనిచేసింది. సినీ నటుడు సోనూసూద్ యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సోనూ సూద్ స్కాలర్‌షిప్ సహకారం అందిస్తున్నారు. మెరిట్ స్కాలర్‌షిప్‌లు, 100% ప్లేస్‌మెంట్, శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, డిగ్రీ విద్యతో సివిల్ కోచింగ్ అత్యాధునికమైన వసతి, ఇంటి తరహా ఆంధ్రా భోజనం. దక్షిణాది విద్యార్థుల సౌకర్యార్థం విజయవాడలో ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు. కాగా, ఈ ప్రెస్ మీట్‌‌లో ప్రో ఛాన్సలర్ డాక్టర్ మన్బీర్ సింగ్, ప్రిన్సిపల్ ఆదిత్య గోయల్, దీపక్ కుమార్ ప్రభాత్ ఐ కేర్, రంభ శివ కుమార్ యమ్.డి ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్, ఆంధ్ర, తెలంగాణ అడ్మిషన్ ఆఫీసర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కేరీర్&ఉద్యోగాలకు సంబంధించిన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..