CSIR-NIIST Recruitment 2022: యూజీసీ నెట్‌/గేట్‌ అర్హతతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పోస్టులు..

|

Aug 18, 2022 | 3:21 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (CSIR-NIIST).. తాత్కాలిక ప్రాతిపదికన..

CSIR-NIIST Recruitment 2022: యూజీసీ నెట్‌/గేట్‌ అర్హతతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పోస్టులు..
Csir Niist
Follow us on

CSIR-NIIST Senior Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (CSIR-NIIST).. తాత్కాలిక ప్రాతిపదికన 5 ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/లైఫ్ సైన్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్ విభాగాల్లో ఎంఎస్సీ, కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ లేదా గేట్‌లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ సాధించి ఉండాలి. 35 యేళ్లకు మించకుండా వయసుండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 24, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.