Central Railway Jobs: అకడమిక్‌ మెరిట్ ఆధారంగా ఎంపికలు.. సెంట్రల్ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ ఉద్యోగాలు..!

|

Feb 23, 2022 | 12:45 PM

భారత ప్రభుత్వ రైల్వే శాఖకు చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వే (Central Railway)ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ పోస్టుల (junior technical associate posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Central Railway Jobs: అకడమిక్‌ మెరిట్ ఆధారంగా ఎంపికలు.. సెంట్రల్ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ ఉద్యోగాలు..!
Central Railway Jta Jobs
Follow us on

Central Railway Jr. Technical Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే శాఖకు చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వే (Central Railway)ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ పోస్టుల (junior technical associate posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 20

పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ పోస్టులు

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్‌/బీఎస్సీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిప్యూటీ చీఫ్‌ పర్సనల్ ఆఫీసర్‌ (కన్‌స్ట్రక్షన్), సెంట్రల్‌ రైల్వే, ముంబాయి, మహారాష్ట్ర-400001.

దరఖాస్తు రుసుము:
జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/మహిళా అభ్యర్ధులకు: రూ.250

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DSEU Librarian Recruitment: ఐటీఐ/బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఢిల్లీ స్కిల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..