CBSE Results 2022: సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 2 ఫలితాలు నేడే.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

|

Jul 20, 2022 | 1:34 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్‌ 2 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 20) విడుదలకానున్నాయి. సీబీఎస్సీ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు..

CBSE Results 2022: సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 2 ఫలితాలు నేడే.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
Cbse Results
Follow us on

CBSE Class 10th Term 2 Result 2022 updates: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్‌ 2 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 20) విడుదలకానున్నాయి. సీబీఎస్సీ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. టర్మ్‌ 2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.in లేదా cbseresults.nic.in లేదా digilocker.gov.in లేదా parikshasangam.cbse.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్ధుల ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా సీబీఎస్సీ 10వ తరగతి, 12 వ తరగతి టర్మ్‌ 2 ఫలితాల కోసం విద్యార్ధులు ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ రోజు 10వ తరగతి ఫలితాలు విడుదలకానున్నాయి. త్వరలో 12వ తరగతి ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు దేశ వ్యాప్తంగా 75 సబ్జెక్టులకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 21,16,209ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ప్రాక్టికల్స్‌, థియరీలతో కలిపి 33 శాతం, ఆపైన మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా బోర్డు ప్రకటించనుంది. సీబీఎస్సీ 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలకు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. జులై చివరి నాటికి అధికారులు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన తేదీ ఏదీ సీబీఎస్సీ బోర్డు అధికారికంగా తెలుపలేదు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.