CBSE CTET 2024 Exam Date: సీటెట్‌ 2024 పరీక్ష కేంద్రాల వివరాలు వెల్లడి.. త్వరలో అడ్మిట్‌కార్డుల జారీ

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024కు సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించే పరీక్ష కేంద్రాల వివరాలను సీబీఎస్‌ఈ వెల్లడించింది. సీటెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సీబీఎస్సీ తన ప్రకటనలో తెల్పింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జనవరి 21న జరగనుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు త్వరలోనే..

CBSE CTET 2024 Exam Date: సీటెట్‌ 2024 పరీక్ష కేంద్రాల వివరాలు వెల్లడి.. త్వరలో అడ్మిట్‌కార్డుల జారీ
CBSE CTET 2024 Exam Centre

Updated on: Jan 12, 2024 | 9:54 PM

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024కు సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించే పరీక్ష కేంద్రాల వివరాలను సీబీఎస్‌ఈ వెల్లడించింది. సీటెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సీబీఎస్సీ తన ప్రకటనలో తెల్పింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జనవరి 21న జరగనుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. కాగా సీటెట్​పరీక్ష ప్రతి యేట రెండుసార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు జరుగుతుంది. మొదటి పేపర్​ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి, రెండో పేపర్​6 నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు లైఫ్​లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తున్నారు. సీటెట్‌లో అర్హత సాధించిన వారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీవో రాత పరీక్ష తేదీ వెల్లడి.. ఎప్పుడంటే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ 5,447 బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీని విడుదల చేసింది. జనవరి 21న ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన డ్మిట్ కార్డులు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ సర్కిళ్లలో 5,447 సీబీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైతే రూ.36,000-రూ.63,840 జీతం ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

డీఈఈ 2023 సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

తెలంగాణ డీఈఈ సెట్‌ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ జనవరి 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ శ్రీనివాస చారి ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 17వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. జనవరి 25వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. డీఈఈ తొలి విడత కౌన్సెలింగ్‌లో 1152 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.