
హైదరాబాద్, ఏప్రిల్ 23: సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహించే విధానాన్ని గత సంవత్సరం సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిని 2026 బోర్డు పరీక్షల నుండి అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్లను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మే 15 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షలు మే 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సెకండ్ బోర్డు పరీక్షల టైం టేబుల్‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. 2026 నుంచి అమలులోకి వస్తున్న ఈ కొత్త బోర్డు పరీక్షల విధానం విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్లను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
విద్యాపరంగా విద్యార్ధులు నష్టపోకుండా మార్కులు మెరుగుపరుచుకునేందుకు ఇది మంది అవకాశం. అంతేకాకుండా ప్రధాన బోర్డు పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గించడానికి, ఫలితాలలో అధిక మార్కులు పొందేందుకు వీలు కల్పిస్తుంది.అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్ధులు, పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ER కేటగిరీ కింద ఉంచబడిన విద్యార్థులకు సీబీఎస్సీ రెండో విడత పరీక్షలకు రాసేందుకు అర్హత ఉండదు. వీరంతా వచ్చే ఏడాది మాత్రమే పరీక్షలు రాసేందుకు అర్హులు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.