Canara Bank Recruitment 2021: కెనరా బ్యాంకు ఆఫీసర్‌ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూన్‌ 30

|

Jun 08, 2021 | 3:24 PM

Canara Bank Recruitment 2021: కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెనరా బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌లో చీఫ్‌ డిజిటల్‌..

Canara Bank Recruitment 2021: కెనరా బ్యాంకు ఆఫీసర్‌ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూన్‌ 30
Canara Bank
Follow us on

Canara Bank Recruitment 2021: కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెనరా బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌లో చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ canarabank.com ను సందర్శించవచ్చు. అయితే ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్‌ 30.

అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి బీఈ, బీటెక్‌ పాస్‌ అయి ఉండాలి. అలాగే ఎంబీఏ, సర్టిఫికేషన్‌ ఇన్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ తప్పకుండా ఉండాలి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కనీసం పది సంవత్సరాల పాటు అనుభవం ఉండాలి. అభ్యర్థులు షార్ట్‌ లిస్టింగ్‌ దరఖాస్తులో ప్రకటించిన అర్హత, అనుభవం పత్రాలు, ధృవపత్రాలు, టెస్టిమోనియల్స్‌ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు తెలియాంటే బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇవీ కూడా చదవండి:

Andhra Pradesh Jobs 2021: ఏపీలో ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..!

IBPS Notification 2021: తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పదివేల బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… చివరి తేదీ ఎప్పుడంటే