BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నేరుగా ఇంటర్వ్యూ..

|

Aug 12, 2022 | 6:57 AM

కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో (BIS).. ఒప్పంద ప్రాతిపదికన 116 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, సైంటిస్ట్‌ 'బి'..

BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నేరుగా ఇంటర్వ్యూ..
Follow us on

Bureau of Indian Standards Graduate Engineer and Scientist ‘B’ Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో (BIS).. ఒప్పంద ప్రాతిపదికన 116 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, సైంటిస్ట్‌ ‘బి’ (Graduate Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టులు 100, సైంటిస్ట్‌ ‘బి’ పోస్టులు 16 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2020/2021/2022లో వ్యాలిడ్‌ స్కోర్ సాధించి ఉండాలి. ఆగస్టు 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 యేళ్లలోపు ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానం ద్వారా ఆగస్టు 26, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక విధానంలో అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.99,699ల వరకు జీతంతో ఉద్యోగం పొందవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.