BSNL Recruitment 2021: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. మహారాష్ట్ర సర్కిల్‌లో ఖాళీగా ఉన్న డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2021-2022 ఏడాదికిగాను ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 55 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికచేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8000ని స్టైపండ్‌గా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 29-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Omicron: ఒమిక్రాన్‌కు ఒకే ఒక్క టాబ్లెట్‌తో చెక్.. ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారంటున్న..
Pralay Missile Test: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం.. ప్రళయ్‌ను మరోసారి పరీక్షించిన DRDO