BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్), సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్), జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల..

BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..
BSF Inspector Recruitment 2023

Updated on: Feb 13, 2023 | 9:22 PM

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. 23 ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్), సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్), జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ (ఆర్కిటెక్చర్), డిప్లొమా (సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 13, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.247లు అప్లికేషన్‌ రుసుముగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరచిన వారికి ఎస్సై/జేఈకు పోస్టులకు నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నెలకు రూ.44,900ల నుంచి రూ.1,42,400ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us