BRO Recruitment 2022: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 246 కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలేవంటే..

|

Aug 12, 2022 | 8:30 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO).. 246 డ్రాఫ్ట్‌మెన్‌, సూపర్‌వైజర్‌, హిందీ టైపిస్ట్‌ తదితర పోస్టుల (Draughts man Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

BRO Recruitment 2022: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 246 కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలేవంటే..
Border Roads Organization
Follow us on

BRO Draughtsman Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO).. 246 డ్రాఫ్ట్‌మెన్‌, సూపర్‌వైజర్‌, హిందీ టైపిస్ట్‌ తదితర పోస్టుల (Draughts man Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌కు విడుదల చేశారు. 18 నుంచి 25 యేళ్ల వయసున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించవల్సి ఉంటుంది. ఇతరులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, జీతభత్యాలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు వంటి ఇతర సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలయ్యాక తెలుసుకోవచ్చు. షార్ట్ నోటిఫికేషన్‌ ఆగస్టు 11, 2022న విడుదలైంది.

ఖాళీల వివరాలు:

  • డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులు: 14
  • సూపర్‌వైజర్ పోస్టులు: 7
  • సూపర్‌వైజర్ సైఫర్ పోస్టులు: 13
  • సూపర్‌వైజర్ దుకాణాలు పోస్టులు: 9
  • హిందీ టైపిస్ట్ పోస్టులు: 10
  • ఆపరేటర్ (కమ్యూనికేషన్) పోస్టులు: 35
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 30
  • వెల్డర్ పోస్టులు: 24
  • మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు: 22
  • మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు: 82

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.