BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

|

Sep 04, 2021 | 12:28 PM

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Bel Recruitment
Follow us on

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా బెంగళూరులోని సంస్థలో ట్రెయినీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 08వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ట్రెయినీ ఇంజనీర్‌–10, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–04 ఖాళీలున్నాయి.
* ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్‌/కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ /టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
* ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 45,000 చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 08-09-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో నేడు జాబ్‌మేళా.. టెక్‌మహీంద్ర, విప్రో వంటి టాప్‌ కంపెనీలు హాజరు.

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.