BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..

|

Jan 04, 2022 | 10:22 AM

Trainee Engineer: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ పోస్టుల నియామకాన్ని ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి..
Bel Recruitment 2022
Follow us on

BEL Recruitment 2022: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ పోస్టుల నియామకాన్ని ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 15 చివరి తేదీగా సంస్థ ప్రకటించింది. ఈ నియామకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల పేరు, మొత్తం ఖాళీలు:
ట్రైనీ ఇంజనీర్ ఖాళీలు, మొత్తం ఖాళీల సంఖ్య – 8

అర్హత:
అభ్యర్థి ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / E & T / టెలికమ్యూనికేషన్స్) విభాగాల్లో ఒక ప్రసిద్ధ సంస్థ / విశ్వవిద్యాలయం నుంచి రెగ్యూలర్ BE / B.Tech కోర్సును పూర్తి చేసి ఉండాలి. అలాగే అన్ని సెమిస్టర్లలో 55% మొత్తం మార్కులు ఉండాలి.

జీతం:
మొదటి సంవత్సరం: రూ. 30,000
రెండవ సంవత్సరం: రూ. 35,000
మూడవ సంవత్సరం: రూ. 40,000

వయోపరిమితి:
అభ్యర్థి వయస్సు 28 ఏళ్లు పైబడి ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఇచ్చారు. అయితే వెనుకబడిన తరగతి (OBC) అభ్యర్థులకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియ:
ఇంజనీరింగ‌లో వచ్చిన మొత్తం పాయింట్లు, సంబంధిత పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవంతో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 15/01/2022

ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Also Read: RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?

Indian Coast Guard Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. ఈరోజు నుంచే అప్లికేషన్స్.. ఎలా అప్లై చేయాలంటే..