BEL Engineer Jobs: బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో 67 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
* ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో 169 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
* ట్రెయినీ ఆఫీసర్ పోస్టులు 11 ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో బీఈ/బీటెక్/ఎంబీఏ/బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు, అనుభవం కూడా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులను అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
* దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 4, 2022.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుంచి రూ. 55,000 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: