భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. 111 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 1, 2022వ తేదీ నాటికి పోస్టును బట్టి 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 23, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయలో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.400, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.150లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా నవంబర్ 23వ తేదీ లోపు పంపించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కింది విధంగా జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Manager (HR),
Product Development & Innovation Centre (PDIC),
Bharat Electronics Limited,
Prof. U R Rao Road, Near Nagaland Circle,
Jalahalli Post, Bengaluru – 560 013, India.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.