BECIL Jobs: నెలకు రూ.56 వేల జీతంతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

|

Mar 13, 2023 | 9:15 PM

గువాహటిలోని ఎయిమ్స్‌లో 73 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి..

BECIL Jobs: నెలకు రూ.56 వేల జీతంతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
BECIL
Follow us on

గువాహటిలోని ఎయిమ్స్‌లో 73 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్/ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, ఓపీడీ అటెండెంట్, టెక్నికల్ ఆఫీసర్, అనస్థీషియా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆర్థోపెడిక్/ ప్లాస్టర్ టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా/డీఎంఎల్‌టీ/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.885, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.531లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.22,000ల నుంచి రూ.56,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.