BECIL Technical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL-AIIA) న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద.. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టుల (Technical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, మిడ్ వైఫ్, ఆపరేషన్ థియేటర్ నర్స్, డెంటల్ హైజినీస్ట్, ఆడియోవిజువల్ గ్రాఫిక్స్, వార్డ్ అటెండెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి 8వ తరగతి, ఇంటర్, సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎమ్మెస్సీ, ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తును ప్రింట్‌ఔట్ తీసుకుని కింది ఈ మెయిల్‌కు పంపించాలి.
ఈ మెయిల్: hrsection@becil.com.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.