BECIL-AIIMS Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ కింద ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న.. ఔట్‌సోర్స్‌ ప్రాతిపదికన 20 జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BECIL-AIIMS Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
BECIL-AIIMS Recruitment 2022

Updated on: Nov 20, 2022 | 7:39 AM

భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ కింద ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న.. ఔట్‌సోర్స్‌ ప్రాతిపదికన 20 జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సైన్స్ స్పెషలైజేషన్‌లో ఇంటర్, ఫిజియోథెరపీలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్‌ 3, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.885, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.531లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us