BECIL-AIIMS Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో ఎయిమ్స్‌ గువహతిలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Sep 15, 2022 | 3:11 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గువ‌హ‌తిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Guwahati) .. 12 అప్పర్ డివిజ‌న్ క్లర్క్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, స్టోర్ కీఫ‌ర్‌, క్యాషియ‌ర్‌ తదితర పోస్టుల (Upper Division Cleark Posts) భర్తీకి..

BECIL-AIIMS Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో ఎయిమ్స్‌ గువహతిలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Aiims Becil
Follow us on

BECIL-AIIMS Guwahati Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గువ‌హ‌తిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Guwahati) .. 12 అప్పర్ డివిజ‌న్ క్లర్క్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, స్టోర్ కీఫ‌ర్‌, క్యాషియ‌ర్‌ తదితర పోస్టుల (Upper Division Cleark Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంట‌ర్ సీఏ/డిప్లొమా/డిగ్రీ/బీకామ్‌/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ. 750, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.450లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.17,752 నుంచి రూ.33,481ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అప్పర్ డివిజ‌న్ క్లర్క్‌ పోస్టులు: 2
  • డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ పోస్టులు: 1
  • స్టోర్ కీఫ‌ర్‌ పోస్టులు: 2
  • క్యాషియ‌ర్‌ పోస్టులు: 1
  • అకౌంట్స్ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • జూనియ‌ర్ అడ్మిన్ ఆఫిస‌ర్‌ పోస్టులు: 2
  • జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫిస‌ర్‌ పోస్టులు: 1
  • అసిస్టెంట్ స్టోర్ ఆఫిస‌ర్‌ పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.