Bank Of India Recruitment 2022: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకి ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్కేల్ 4 వరకు ఆఫీసర్ ర్యాంక్ పోస్టులకు రెగ్యులర్, కాంట్రాక్టు ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇందులో ఎకనామిస్ట్, స్టాటిస్టిషియన్, రిస్క్ మేనేజర్ సహా పలు పోస్టులని భర్తీ చేస్తున్నారు. మొత్తం 594 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 102 పోస్టులను నియమించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుంటే మంచిది. బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకి దరఖాస్తు ప్రక్రియ 26 ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 10 మే 2022 వరకు సమయం ఉంది.
మీరు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ లో అందించిన దరఖాస్తు ఫారమ్ సహాయంతో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ. 850 రుసుము చెల్లించాలి. దీనిని ఆన్‌లైన్ మార్గాల ద్వారా చెల్లించవచ్చు. అదే సమయంలో SC / ST / దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలుగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ
బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తుదారుల సంఖ్య, ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 150 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, బ్యాంకింగ్ ఫోకస్డ్ జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 594 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అందులో మేనేజర్ IT, సీనియర్ మేనేజర్ (IT), సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ), సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్ రూటింగ్ మరియు స్విచింగ్ స్పెషలిస్ట్‌లు), మేనేజర్ (ఎండ్ పాయింట్ సెక్యూరిటీ), మేనేజర్ (డేటా సెంటర్), మేనేజర్ (డేటాబేస్ ఎక్స్‌పర్ట్), మేనేజర్ (టెక్నాలజీ) ) ఆర్కిటెక్ట్), మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్) పోస్టులని భర్తీ చేస్తారు.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి