TET Paper-1: బీఈడీ అభ్యర్థులకు గమనిక.. మార్పులు చేసుకుంటూ చదివితే మంచి స్కోర్ మీదే

|

Apr 06, 2022 | 5:01 PM

టీఎస్​టెట్​–2022 నోటిఫికేషన్(TET-2022 Notification) విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాల వ్యాలిడిటీ ఇచ్చింది. అంతే కాకుండా బీఈడీ అభ్యర్థులూ పేపర్​ -1 రాసుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే గతంలో బీఈడీ(B.ed) చేసిన వారు....

TET Paper-1: బీఈడీ అభ్యర్థులకు గమనిక.. మార్పులు చేసుకుంటూ చదివితే మంచి స్కోర్ మీదే
Ts Tet 2022
Follow us on

టీఎస్​టెట్​–2022 నోటిఫికేషన్(TET-2022 Notification) విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాల వ్యాలిడిటీ ఇచ్చింది. అంతే కాకుండా బీఈడీ అభ్యర్థులూ పేపర్​ -1 రాసుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే గతంలో బీఈడీ(B.ed) చేసిన వారు పేపర్​–2 మాత్రమే రాసేందుకు అవకాశం ఉండేది. పేపర్​–1లో 1 నుంచి 5 తరగతుల వరకు 5 సబ్జెక్టుల కంటెంట్​తో పాటు, 5 మెథడాలజీలు, సైకాలజీ తప్పనిసరిగా చదవాల్సి రావడంతో ఎలా సన్నద్ధం అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. టెట్​ సిలబస్​లో సైకాలజీ సంబంధించిన పేపర్​–1, పేపర్​–2 దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ బీఈడీ, డీఈడీలో సిలబస్‌లో కొంత మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా డీఈడీలోని సిలబస్​ప్రాథమిక స్థాయి విద్యార్థులనుద్దేశించి రూపొందించింది. అయితే పేపర్​–1 రాసే బీఈడీ అభ్యర్థులు టెట్​సైకాలజీ(Psychology) సిలబస్​ను డీఈడీ సైకాలజీకి అన్వయించుకుంటూ చదవాల్సి ఉంటుంది. తెలుగుకు సంబంధించిన వ్యాకరణ అంశాలు పేపర్​ 1, పేపర్​2కు ఒకే విధంగా ఉన్నా..కంటెంట్​ విషయానికొస్తే తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నా కవి పరిచయాలు, పాఠ్యాంశ నేపథ్యాలు,సంభాషణలు, పాత్రలు చదువుకోవాలి. గతంలో 2వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోనుంచి కూడా ప్రశ్నలు అడిగారు.

టెట్​పేపర్-2 సోషల్​స్టడీస్​ రాసే అభ్యర్థులు పేపర్​-1 రాస్తే వారు సైన్స్‌తో పాటు మ్యాథమెటిక్స్​సబ్జెక్ట్ ప్రిపేర్​ కావాల్సి ఉంటుంది. సోషల్​ స్టూడెంట్స్​ మ్యాథ్స్​సబ్జెక్ట్​ ఇబ్బందిగా భావిస్తారు. అలా అని వదిలిపెట్టకుండా 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక స్థాయి సిలబస్​ను అర్ధం చేసుకుని ప్రాక్టీస్​ చేస్తే మార్కులు సాధించవచ్చు. టెట్​పేపర్-​2 సైన్స్​రాసే అభ్యర్థులకు సైన్స్​, మ్యాథ్స్​సంబంధించి 60 ప్రశ్నలు ఉంటాయి. కానీ పేపర్​ –1లో సైన్స్​, సోషల్​ రెండింటికి కలిపి కేవలం 30 మార్కులు మాత్రమే కేటాయించారు. బీఈడీ చేసిన అభ్యర్థులు మెథడాలజీ కి సంబంధించి వారు చదివిన సబ్జెక్టు మెథడాలజీ మాత్రమే చదవుతారు. వారికి ఇతర విషయాల మెథడాలజీతో సంబంధం ఉండదు. కానీ టెట్​పేపర్​–1 రాస్తే అన్ని సబ్జెక్టుల మెథడాలజీల సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఇది బీఈడీ అభ్యర్థులకు కొంత ఇబ్బంది కలిగించే విషయం.

చివరగా.. బీఈడీ అభ్యర్థులు పేపర్​–1 లేదా పేపర్​–2 రెండింటిలో దేనికి ప్రిపేరవ్వాలో స్పష్టత ఉండాలి. ఏదైనా ఒకే పేపర్​కు ప్రిపేరయితేనే మంచి స్కోర్​ సాధించగలరు. సిలబస్​ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడున్న సమయంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవలేరు. రెండింటిని కలిపి చదవితే ఎందులోనూ విజయం సాధించలేరు. కాబట్టి ఏదైనా ఒక దానిపైనే దృష్టి సారించాలి.

Also Read

Sridevi Shobhan Babu: ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో వస్తున్న సంతోష్ శోభన్.. టీజర్ లాంచ్ చేయనున్న డీజే టిల్లు

Aamna Sharif: డిఫరెంట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఆమ్నా షరీఫ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Viral Video: కచ్చా బాదాం పాటకు మాధురీ దీక్షిత్.. రితేష్ దేశ్‏ముఖ్ అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్..