APVVP Recruitment 2021: కడప జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్స్ (ఏపీవీవీపీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిస్ట్రిక్ కోఆర్టినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్‌కి చెందిన ఈ సంస్థలో పీడియాట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 పీడియాట్రీషియన్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌తో పాటు డీసీహెచ్/ఎండీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఏపీవీవీపీ, కడప, న్యూ కలక్టరేట్, ఓ బ్లాక్, కడప జిల్లా అడ్రస్‌లో సప్రందించాలి.
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూలను జులై 27 నుంచి 29 వరకు నిర్వహిస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,50,000 జీతంగా చెల్లిస్తారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: TS Polycet Results: విడుదలైన తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..