APPSC Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీపీఎస్సీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల! రేపట్నుంచే దరఖాస్తులు

APPSC job 2025 Notification: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు..

APPSC Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీపీఎస్సీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల! రేపట్నుంచే దరఖాస్తులు
APPSC job Notification

Updated on: Sep 17, 2025 | 2:32 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 21 డ్రాట్స్‌మెన్‌ గ్రేడ్‌-2 (టెక్నికల్ అసిస్టెంట్‌), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, హర్టీకల్చర్‌ ఆఫీసర్‌, జూనియర్ లెక్చరర్‌ (లైబ్రరీ సైన్స్‌), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సెప్టెంబర్‌ 18, 2025 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • డ్రాట్స్‌మెన్‌ గ్రేడ్‌-2 (టెక్నికల్ అసిస్టెంట్‌) పోస్టుల సంఖ్య: 13
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ పోస్టుల సంఖ్య: 3
  • హర్టీకల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 2
  • జూనియర్ లెక్చరర్‌ (లైబ్రరీ సైన్స్‌) పోస్టుల సంఖ్య: 2
  • హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌ (సివిల్), బీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 8, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.120 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఎంపికైన వారికి నెలకు డ్రాట్స్‌మెన్‌ పోస్టులకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు, హర్టీకల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు, జూనియర్ లెక్చరర్‌ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ జాబ్‌నోటిఫికేషన్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.