APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు! నెలకు రూ.లక్షన్నర జీతం

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో CBRT, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయి..

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు! నెలకు రూ.లక్షన్నర జీతం
APPSC Forest Range Officer Recruitment

Updated on: Sep 21, 2026 | 3:42 PM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జూలజీ తదితర విభాగాల్లో సంబంధిత డిగ్రీ కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT), క్వాలిఫైయింగ్ టెస్ట్, నాలుగు పేపర్లతో ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులను నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు APPSC అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం, ఫీజు, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి.

ముఖ్యమైన వివరాలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 16, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 5, 2026.
  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల సంఖ్య: 4
  • జీతం: రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us