AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజుల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11 నుంచి చెల్లింపులు ప్రారంభం!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 11 నుంచి 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.50, రూ.200, రూ.500 ఆలస్య రుసుములతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రెగ్యులర్, వృత్తివిద్య విద్యార్థులకు ఫీజు వివరాలు, ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి..

పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజుల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11 నుంచి చెల్లింపులు ప్రారంభం!
AP SSC Exams Fee Payment Schedule
Srilakshmi C
|

Updated on: Nov 09, 2026 | 8:34 AM

Share

అమరావతి, నవంబర్ 9: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. పరీక్ష ఫీజు చెల్లింపునకు ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. గడువు దాటిన తర్వాత ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు కూడా విడతలవారీగా అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు.

ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు తేదీలు ఇవే!

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అధికారులు మూడు విడతల్లో గడువు ప్రకటించారు.

  • నవంబర్ 11 నుంచి 25 వరకు: ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
  • నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు: రూ.50 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.
  • డిసెంబర్ 3 నుంచి 9 వరకు: రూ.200 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.
  • డిసెంబర్ 10 నుంచి 15 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

పదో తరగతి పరీక్ష ఫీజు వివరాలు

విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులు రాస్తున్నారనే దాని ఆధారంగా పరీక్ష ఫీజు నిర్ణయించారు.

  • మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే రెగ్యులర్ విద్యార్థులు: రూ.125.
  • మూడు సబ్జెక్టుల వరకు రాసే రెగ్యులర్ విద్యార్థులు: రూ.110.
  • వృత్తి విద్యా కోర్సుల అభ్యర్థులు: అదనంగా రూ.60.
  • వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు కోరే విద్యార్థులు: రూ.300 అదనపు రుసుము చెల్లించాలి.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా నవంబర్ 25లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడం మంచిది. ఆలస్యమైతే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

Follow Us
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు