AP PGCET 2026 Last Date: ఏపీ పీజీసెట్‌ 2026 ప్రవేశ పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయలేదా..? రేపటితో ముగుస్తున్న గడువు..

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌ 2026) దరఖాస్తు ప్రక్రియ రేపటితో (మార్చి 28) ముగియనుంది. ఇప్పటి వరకు ఇంకా పీజీ సెట్‌కు దరఖాస్తు చేయని అభ్యర్థులుమార్చి 28వ తేదీ ముగింపు..

AP PGCET 2026 Last Date: ఏపీ పీజీసెట్‌ 2026 ప్రవేశ పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయలేదా..? రేపటితో ముగుస్తున్న గడువు..
AP PGCET registration deadine

Updated on: Mar 27, 2026 | 7:35 AM

అమరావతి, మార్చి 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌ 2026) దరఖాస్తు ప్రక్రియ రేపటితో (మార్చి 28) ముగియనుంది. ఇప్పటి వరకు ఇంకా పీజీ సెట్‌కు దరఖాస్తు చేయని అభ్యర్థులుమార్చి 28వ తేదీ ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఇక ఈ ఏడాది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీసెట్‌ 2026 ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీ పీజీసెట్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ టెక్నా్లజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీ పీజీసెట్‌ 2026 ప్రవేశ పరీక్ష మే 5 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఏపీ పీజీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, బీపీఈడీ వంటి సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.650 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28, 2026.
  • రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2026.
  • రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 3, 2026.
  • రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 6, 2026.
  • రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2026.
  • దరఖాస్తు కరెక్షన్‌ విండో తేదీ: ఏప్రిల్ 5, 2026.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ తేదీ: ఏప్రిల్ 20, 2026 నుంచి.
  • ఏపీ పీజీసెట్‌ 2026 ప్రవేశ పరీక్ష: మే 5 నుంచి 11 వరకు.

ఏపీ పీజీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us