AP DSC 2026 Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్‌! వచ్చే నెలలో టెట్‌

మంత్రి లోకేష్ తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక ప్రకటన వెలువరించారు. అంతకంటే ముందు ఈ ఏడాది నవంబర్‌ చివరివారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని..

AP DSC 2026 Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్‌! వచ్చే నెలలో టెట్‌
AP DSC 2026 Notification

Updated on: Oct 10, 2025 | 9:19 AM

అమరావతి, అక్టోబర్‌ 10: రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక ప్రకటన వెలువరించారు. అంతకంటే ముందు ఈ ఏడాది నవంబర్‌ చివరివారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని భావించారు. గురువారం (అక్టోబర్‌ 9) పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ఈ మేరకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతిఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామన్నారు.

ఈ సందర్భంగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో టెట్‌ నోటిఫికేషన్‌, ఇక వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే ఏడాది మార్చిలోనే డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై యేటా డీఎస్సీ నిర్వహించనున్నట్లు మంత్రి లోకేష్‌ చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక ఇప్పటికే మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ నుంచి బడుల్లో చేరనున్నారు. ఇక మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందని వారంతా వచ్చే టెట్, డీఎస్సీలకు సన్నద్ధం కావాలని మంత్రి లోకేశ్ సూచించారు. కొత్త డీఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్పెషల్ డీఎస్సీపై కూడా మంత్రి లోకేష్‌ క్లారిటీ ఇచ్చారు. మార్చిలో డీఎస్సీతోపాటు స్పెషల్ డీఎస్సీని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులన్నింటినీ వచ్చే కొత్త డీఎస్సీలో నోటిఫికేషన్ భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి లోకేష్‌ పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.