AP Anganwadi Jobs 2026: పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WCD) ఆధ్వర్యంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో 230 అంగన్‌వాడీ హెల్పర్ (ఆయా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వివాహిత మహిళలు జూన్ 18, 2026 వరకు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది..

AP Anganwadi Jobs 2026: పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
AP Anganwadi Helper Recruitment

Updated on: Jun 09, 2026 | 4:23 PM

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WCD) ఆధ్వర్యంలోని శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి డివిజన్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ హెల్పర్ (ఆయా) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూన్ 18, 2026 వరకు సంబంధిత ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 230 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు..

  • కదిరి ప్రాజెక్ట్‌లో పోస్టుల సంఖ్య: 70
  • నల్లచెరువు ప్రాజెక్ట్‌లో పోస్టుల సంఖ్య: 51
  • ధర్మవరం ప్రాజెక్ట్‌లో పోస్టుల సంఖ్య: 21
  • బత్తలపల్లి ప్రాజెక్ట్‌లో పోస్టుల సంఖ్య: 63
  • సి.కె.పల్లి ప్రాజెక్ట్‌లో పోస్టుల సంఖ్య: 25

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత గ్రామంకి చెందిన వివాహిత మహిళ అయి ఉండాలి. అలాగే సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానికురాలై ఉండాలి. రిజర్వేషన్ ప్రయోజనాలు పొందే అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో జూన్‌ 18వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను జతచేసి కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తులు నేరుగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలోనే ఇస్తారు. వాటిని నింపి అక్కడే అందజేయాలి.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10వ తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ మహిళలకు ఇది మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీ సత్యసాయి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us