Free Coaching to College Students: ఉచితంగా ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులకు జేఈఈ, నీట్, ఈఏపీసెట్‌ కోచింగ్‌.. మెటీరియల్స్ కూడా!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్ధులకు కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా పోటీ పరీక్షల్లో రాణించేందుకు కోచింగ్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి రోజు విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్, ఈఏపీసెట్‌ వంటి కీలక ప్రవేశ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో..

Free Coaching to College Students: ఉచితంగా ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులకు జేఈఈ, నీట్, ఈఏపీసెట్‌ కోచింగ్‌.. మెటీరియల్స్ కూడా!
Govt Junior Colleges

Updated on: May 08, 2025 | 3:08 PM

అమరావతి, మే 8: కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా పోటీ పరీక్షల్లో రాణించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్ధులకు కోచింగ్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి రోజు విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్, ఈఏపీసెట్‌ వంటి కీలక ప్రవేశ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో నిపుణులైన అధ్యాపకులతో ప్రభుత్వ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యలో కూటమి ప్రభుత్వం 2025 ఏడాది నుంచి పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులను నిట్, ఐఐటీ, వైద్య విద్య, ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు సన్నద్ధం చేయనున్నారు.

బోధనతోపాటు కోచింగ్‌ సైతం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోచింగ్‌కు అవసరమైన మెటీరియల్‌ను కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించనుంది. ఇప్పటికే మెటీరియల్‌ను సిద్ధం చేయగా.. ముద్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత కోచింగ్‌ను అమలు చేయడానికి జూనియర్‌ కాలేజీల సమయాన్ని సైతం పొడిగించారు. దీంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్‌ కాలేజీలు పనిచేయనున్నాయి. ఇందులో మధ్యాహ్నం 3 నుంచి ఐదు గంటల వరకు ప్రతి రోజూ కోచింగ్‌కు కేటాయిస్తారు. జూనియర్‌ కాలేజీల్లో ఉచిత కోచింగ్‌ కార్యక్రమం పేద పిల్లలకు ఉపయోగపడుతుందనే అభిప్రాయం సర్పత్రా వ్యక్తమవుతోంది.

దివ్యాంగ అభ్యర్థులకు ఉచితంగా మెగా డీఎస్సీ కోచింగ్‌.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన మెగా డీఎస్సీలో ప్రతిభకనబరిచేందుకు దివ్యాంగ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా కోచింగ్‌ అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ రవిప్రకాశ్‌రెడ్డి మే 7న ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్ధుల నుంచి మే 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40 శాతం వైకల్యం ఉన్న వారు మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.