
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీ ఎడ్‌సెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ రేపటితో (మార్చి 26) ముగుస్తోంది. ఈ మేరకు ఎడ్‌సెట్‌కు ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు 2026 మార్చి 26వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాదికి ఎడ్‌సెట్ పరీక్షను చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఏపీ ఎడ్‌సెట్ 2026 పరీక్ష మే 4న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ఏపీ ఎడ్‌సెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీఏ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ, హోం సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ వంటి బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా సంబంధిత సబ్జెక్టులో ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌కు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాలి. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా బుధవారం (మార్చి 26) ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్ధులు రూ.700, బీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.