
AP CETs Schedule 2026
అమరావతి, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ 2026 ప్రవేశ పరీక్ష తేదీని APSCHE ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఏపీ ఈఏపీసెట్ 2026 పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ మధ్య తేదీల్లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి తిరుపతి రావు వచ్చే విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏయే తేదీల్లో ఏయే సెట్ పరీక్షలు జరుగుతాయో, నిర్వహణ తేదీలు ఏమిటో ఈ కింది షెడ్యూల్‌లో తెలుసుకోండి.
ఏపీ సెట్స్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..
- ఏపీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 12, 13, 14, 15, 18 తేదీల్లో మొత్తం 10 సెషన్లలో జరుగుతాయి
- ఏపీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్ష తేదీలు: మే 19, 20 మొత్తం నాలుగు సెషన్లలో జరుగుతాయి
- ఏపీ ఈసెట్ 2026 పరీక్ష తేదీ: ఏప్రిల్ 23న మొత్తం రెండు సెషన్లలో జరుగుతాయి
- ఏపీ ఐసెట్ 2026 పరీక్ష తేదీ: ఏప్రిల్ 28న రెండు సెషన్లలో జరుగుతాయి
- ఏపీ పీజీఈసెట్ 2026 పరీక్ష తేదీ: ఏప్రిల్ 29, 30, మే 2 ఆరు సెషన్లలో జరుగుతాయి
- ఏపీ పీజీసెట్ 2026 పరీక్ష తేదీ: మే 5, 8, 9, 10, 11 తేదీల్లో 10 సెషన్లలో జరుగుతాయి
- ఏపీ లాసెట్ 2026 పరీక్ష తేదీ: మే 4 ఒక సెషన్ జరుగుతుంది
- ఏపీ ఎడ్‌సెట్ 2026 పరీక్ష తేదీ: మే 4 ఒక సెషన్ జరుగుతుంది
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.